ఎంపీ పీఏల పేరుతో అక్రమ వసూళ్లు.. ముగ్గురు అరెస్ట్

లంగాణ రాష్ట్ర సమితి ఎంపీ మాలోత్ కవిత పీఏల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. మాలోతు కవిత పీఏ పేరుతో [more]

Update: 2021-04-02 01:03 GMT

లంగాణ రాష్ట్ర సమితి ఎంపీ మాలోత్ కవిత పీఏల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. మాలోతు కవిత పీఏ పేరుతో లక్ష వసూలు చేస్తూ వారు సీబీఐకి పట్టుబడ్డారు. ఢిల్లీలోని ఒక ఇంటి యజమాని నుంచి ఐదు లక్షలు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణం పేరుతో ఈ వసూళ్లకు పాల్పడ్డారు. వసూళ్లకు పాల్పడిని రాజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మాలోత్ కవిత ఇందులో దుర్గేష్ తన కారు డ్రైవర్ అని, రెండు నెలల క్రితమే ఉద్యోగంలో చేరారని, తన సిబ్బంది క్వార్టర్స్ ఇచ్చానని మాలోతు కవిత చెప్పారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని ఆమె చెప్పారు.

Tags:    

Similar News