Breaking : కేసీఆర్ సర్కార్ కు షాక్

కోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తునకు డివిజన్ బెంచ్ అనుమతించింది.

Update: 2023-02-06 05:31 GMT

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తునకు డివిజన్ బెంచ్ అనుమతించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సిట్ ద్వారా జరిపితే తమకు నమ్మకం లేదని, సీబీఐకి ఈ కేసును అప్పగించాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న కారణాలతో ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సరికాదని వాదించింది.

డివిజన్ బెంచ్ నిర్ణయంతో...
దీనిపై చీఫ్ జస్టిస్ తో కూడిన డివిజన్ బెంచ్ ఇరువర్గాల వాదనలను వినింది. గత నెల 30వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు సీబీఐకి అప్పగించాల్సి ఉంది. మరి ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుందా? సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవుతుందా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News