శాసనసభ పక్ష నేతలు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా యడ్యూరప్ప, జనతాదళ్ ఎస్ శాసనసభ పక్ష నేతగా కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాని ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి ఐదుగురుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. విజయనగర ఎమ్మెల్యే ఆనందసింగ్, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర, హుమ్నాబాద్ ఎమ్మెల్యేరాజశేఖర్ పాటిల్, భీమా నాయక్, అమరగౌడ నాయక్ లు సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను క్యాంప్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో బీజేపీ బలం 105కు చేరింది. ఈ సాయంత్రానికి ఎమ్మెల్యేలను కొచ్చి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ బలం పెరుగుతుండటంతో తామే ప్రభుత్వం ఏర్పాుటు చేస్తామని యడ్యూరప్ప చెబుతున్నారు.