అశ్వమేధ యాగం ఆగదా?

Update: 2018-05-18 02:30 GMT

బిజెపి ఆ పేరు వినపడగానే భయపడే స్థితికి చేరుకున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఎన్నికల్లో సామ,దాన దండోపాయాలు ఉపయోగించడం లో ఇప్పుడు మోడీచ అమిత్ షా ద్వయం కాంగ్రెస్ ను మించి రాజకీయం చేస్తూ దేశం మొత్తం తమఖాతాలోకి వేసుకునేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను దేశంలోని అన్ని ప్రధాన రాజకీయపార్టీలు నిశితంగా పరిశీలించాయి. దక్షిణాదిన తమిళనాడులో జరిగిన తతంగం చూశాయి. గోవా, మణిపూర్ లలో జరిగిన అవమానాలు భరించాయి. ఇవన్నీ ఒక ఎత్తు. తాజాగా మోడీ - అమిత్ షా ద్వయం సాగిస్తున్న అశ్వమేధయాగం ఇప్పట్లో ఆగేది ఏమి కాదు. దాంతో తెలుగు రాష్టాల సీఎంలలో కలవరం మొదలైంది.

కాంగ్రెస్ నేర్పిందేనా ...?

అధికారం హస్తగతం చేసుకోవడానికి గతంలో కాంగ్రెస్ ఇలాంటివి ట్రిక్స్ ఎన్నో అమలు చేసింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ బిజెపి రిపీట్ చేస్తుంది. ఆ నొప్పి తగ్గేటప్పటికీ చాలా సమయం కాంగ్రెస్ కి పట్టేలాగే వుంది. ప్రస్తుతం తమ పార్టీ ఎమ్యెల్యేలను అండర్ గ్రౌండ్ కి తరలించాయి జేడీఎస్, సైతం తమ పార్టీలను కాపాడుకోవమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. కర్ణాటకలో ఉండటం సేఫ్ కాదని స్టార్ హోటల్స్ నుంచి క్యాంప్ లు మరోచోటికి ఈ రెండు పార్టీలు తరలించాయి.

గులాం నబీ గగ్గోలు ...

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ బిజెపి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇలాంటి అనైతిక విధానాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని ఘాటుగా స్పందించారు ఆయన. గవర్నర్ పూర్తిగా బిజెపి ఏజెంటుగా మారిపోయారని విమర్శించారు. న్యాయం తమవైపు ఉందని సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాలో ఉన్నామని చెప్పారు. కర్ణాటక వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని గులాం నబీ డిమాండ్ చేశారు.

Similar News