పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్

మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, విద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్..

Update: 2022-03-16 11:07 GMT

పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం భగత్ సింగ్ పుట్టిన గ్రామమైన నవన్ షహర్ జిల్లాలోని ఖాట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేశారు. భగత్ సింగ్ నినాదమైన ఇంక్విలాబ్ జిందాబాద్ తోనే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం తన సహచర ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ ఓ విజ్ఞప్తి చేశారు.

"మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, విద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు నా కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తానని భగవంత్ తెలిపారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు, వేలాది మంది ప్రజలు విచ్చేశారు.



Tags:    

Similar News