భారత్ నుంచి వస్తే జైలు శిక్ష తప్పదు

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి భారత్ నుంచి ఎవరైనా వస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మే 3వ తేదీన డెడ్ లైన్ గా [more]

Update: 2021-05-02 00:59 GMT

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి భారత్ నుంచి ఎవరైనా వస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మే 3వ తేదీన డెడ్ లైన్ గా పెట్టింది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో తమ దేశ పౌరుల ఆరోగ్యం పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి గ్రెట్ హంట్ తెలిపారు. భారత్ లో ఉన్న తమ దేశ పౌరులకు కూడా ఇది వర్తిస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. భారత్ నుంచి వస్తే జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించింది.

Tags:    

Similar News