జీహెచ్ఎంసీలో బయటపడ్డ భారీ స్కామ్..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ బయటపడింది. కార్మికులు లేకున్నా.. విధులకు హాజరుకాకున్నా.. సింథటిక్ ఫింగర్ ప్రింట్ లతో అటెండెన్సులు వేసి సూపర్ వైజర్లు [more]

Update: 2019-01-30 10:35 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ బయటపడింది. కార్మికులు లేకున్నా.. విధులకు హాజరుకాకున్నా.. సింథటిక్ ఫింగర్ ప్రింట్ లతో అటెండెన్సులు వేసి సూపర్ వైజర్లు జీతాలు నొక్కేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది హాజరు విధానంలో బయోమెట్రిక్ ప్రవేశపెట్టడంతో ప్రతి నెల నాలుగు కోట్ల వరకు జీహెచ్ఎంసీకి సేవ్ అవుతుంది. అంతకు ముందు ఈ డబ్బులను సూపర్ వైజర్ లతోపాటు కొంతమంది అధికారులు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో వీరి ఆటలు సాగలేదు. దీంతో తమ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించిన కొందరు సూపర్ వైజర్లు కార్మికులకు చెందిన సింథటిక్ వేలిముద్రలను తయారుచేసి అటెండెన్స్ వేస్తున్నారు. ఇలా ప్రతి నెలా కోట్లాది రూపాయలు బల్దియా ఖజానాను లూటీ చేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించి వారిని అదుపులో తీసుకుంది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజీత్.

Tags:    

Similar News