దేశవ్యాప్తంగా ఏటీఎం లలో నగదు నిల్వలు నిండుకొంటున్నాయి. ఎన్నిసార్లు తిరిగినా మని మిషన్ లు కరుణించకపోవడంతో వాటిని ప్రజలు కొన్ని చోట్ల బద్దలు కొడుతూ తమ కోపాన్ని చవిచూపిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఏటీఎం లపై దాడులు చేస్తున్నారు ప్రజలు. అది డబ్బు తీసుకోవడానికి కాదంటూ పగుల కొట్టేస్తున్నారు. మా డబ్బు మాకెందుకు ఇవ్వరు అంటూ తీవ్ర స్థాయిలో చెలరేగిపోతున్నారు జనం. ఇప్పుడు దేశంలో చాలా ప్రాంతాల్లో ఏటీఎం లలో క్యాష్ లేకుండా పోతున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
కర్ణాటకలో ఎన్నికల సెగ ...
మే 12 న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు . దాంతో ఇక్కడ డబ్బులు విచ్చలవిడిగా వరదలై పారుతున్నాయి. ఎన్నికలు లేకపోయినా ఎపి, తెలంగాణ, అస్సాం, నాగాలాండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో నోట్లు కానరావడం లేదు. ఉత్తరాదిన పండుగల కారణంగా ప్రజలు ఏటీఎం లనుంచి పెద్దఎత్తున విత్ డ్రా చేసుకోవడంతో ఈ పరిస్థితి ఉందంటున్నారు, ప్రస్తుత సమస్యపై ఇప్పుడు మోడీ సర్కార్, మరోవైపు ఆర్బీఐ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేలా కృషి మొదలు పెట్టాయి. నగదు వాడకం అసాధారణ రీతిలో పెరగడంతో క్యాష్ అందుబాటులో లేకుండా పోయిందని కేంద్ర ఆర్ధికమంత్రి వివరణ ఇచ్చారు. ఎప్పటిలోగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో, ప్రస్తుతం ఆర్థికమంత్రికి సైతం దీనిపై అవగాహన ఎప్పటికి వస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.