ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు అప్పుడే....!!!

Update: 2018-12-19 08:01 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్ల అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని మరోసారి కేంద్రం తెలిపింది. రెండు తెలుగురాష్ట్రాలో శాసనసభనియోజకవర్గాలు పెంచాలని విభజన చట్టంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో 119 స్థానాల నుంచి 175 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో 175 నుంచి 225 స్థానాలకు పెంచాలన్న చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ కేంద్రం నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. తెలంగాణలో ఎన్నికలు కూడా ముగిశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు సుజనాచౌదరి మరోసారి నియోజకవర్గాల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనికి సమాధానమిచ్చిన కేంద్ర సహాయ మంత్రి గంగారాం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చె్పారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 సేకరించే జనభా లెక్కల ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. అంటే మరో ఏడేళ్ల పాటు నియోజకవర్గాల పెంపు లేనట్లేనని గంగారాం తేల్చిచెప్పడం విశేషం.

Similar News