తెలంగాణలో కరోనాకు మరో పోలీసు బలి

హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఇవాళ మరొక పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డాడు . డబీర్ పుర పోలీస్ స్టేషన్లో లో హోంగార్డుగా [more]

Update: 2020-06-16 05:37 GMT

హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఇవాళ మరొక పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డాడు . డబీర్ పుర పోలీస్ స్టేషన్లో లో హోంగార్డుగా పని చేస్తున్న అశోక్ కుమార్ మరణించాడు. గత కొన్ని సంవత్సరాలుగా డబీర్ పుర పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా అశోక్ కుమార్ పని చేస్తున్నాడు. హైదరాబాద్ పోలీస్ శాఖలో ఇప్పటికి ఇద్దరు పోలీసు అధికారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే దాదాపు 150 మంది పైగా పోలీస్ కమిషనరేట్ లో అధికారులు కరోనా బారినపడ్డారు. అయితే ఇందులో చాలామంది కూడా కరోనా నుంచి చికిత్స పొంది బయటపడ్డారు. డబీర్ పుర పోలీస్ స్టేషన్లో లో హోంగార్డు అశోక్ కుమార్ గత కొన్నాళ్ల నుంచి పని చేస్తున్నాడు . 4 రోజుల క్రితం పాత బస్తీ లోని తన ఇంట్లో బాత్రూం లో ఒక్కసారిగా కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు మలక్ పేట్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి కి అశోక్ కుమార్ ను చికిత్స నిమిత్తం తీసుకొని పోయారు. . అక్కడ పరీక్షలు చేయగా అశోక్ కుమార్ కు కరోనా గా నిర్ధారణ అయింది.. అశోక్ కుమార్ కు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలోనే అతని పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో అశోక్ మరణించాడు

Tags:    

Similar News