చంద్రబాబుతో గెహ్లాట్ భేటీకి కారణమదేనా..?

Update: 2018-11-10 07:33 GMT

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బంధం బాగా బలోపేతం అయినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కేవలం ఒక్కసారి మాత్రమే రాహుల్ గాంధీని కలిసినా... కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబుపై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ కావడానికి అమరావతికి వస్తున్నారు.

లిస్టు ఫైనల్ కోసమేనా...?

జాతీయ రాజకీయాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని చెపుతున్నా... తెలంగాణ ఎన్నికలపైనే ప్రధాన చర్చ ఉండనుంది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును గెహ్లాట్ చంద్రబాబు వద్దకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ లిస్టుపై ఆయన అభిప్రాయం తీసుకుని మార్పులు చేర్పులు సూచించాలని కాంగ్రెస్ కోరే అవకాశం ఉంది. చంద్రబాబు ఫైనల్ చేశాక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది.

Similar News