ఆశారాం....ఇక జైలులోనే

Update: 2018-04-25 05:58 GMT

వివాదాస్పద బాబా ఆశారాం బాపూను జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. 2013 లో ఆశారాం బాపూ ఒక బాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆశారాం బాపూ 2013 నుంచి జైలు జీవితాన్నే గడుపుతున్నారు. ఈ కేసులో తుదితీర్పును కొద్దిసేపటి క్రితం జోధ్ పూర్ న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో బాపును దోషిగా కోర్టు నిర్ధారించింది. న్యాయస్థానం రేపు శిక్ష ఖరారు చేసే అవకాశముంది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా కోర్టు తేల్చింది. బాపూ కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో ఉన్న ఆశారాం బాపూ ఆశ్రమాలపై నిఘా ఉంచారు. బాపు భక్తులు ఆందోళనకు దిగే అవకాశముందన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.

Similar News