ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దూకుడు

ఈఎస్ఐ స్కాంలో విచారణ చేసిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ఐ స్కాం లో నిందితులైన ఏడుగురు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఇవ్వాళ [more]

Update: 2019-10-09 08:42 GMT

ఈఎస్ఐ స్కాంలో విచారణ చేసిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ఐ స్కాం లో నిందితులైన ఏడుగురు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఇవ్వాళ చంచల్ గూడ జైలు నుంచి ఏడుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 6 గురు నిందితులను కూడా ఈ రోజు కస్టడీలోకి తీసుకోబోతున్న ఏసీబీ అధికారులు. ఈ ఏడుగురు నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి ఏడుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ,రేపు నిందితులను విచారించనున్నారు ఏసీబీ అధికారులు.

కస్టడీలోకి తీసుకున్న వారి పేర్లు

1. ఈఎస్ఐ డైరెక్టర్ – దేవికారాణి

2. జాయింట్ డైరెక్టర్ – పద్మ

3. అసిస్టెంట్ డైరెక్టర్ – వసంత

4. ఫార్మాసిస్ట్ – రాధిక

ఇతర సిబ్బంది

5. నాగరాజు

6. హర్షవర్ధన్,

7. శ్రీహరి

ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. దీనిపై విచారణ, తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో మరికొంత మందిని కూడా అరెస్టు చేయనున్నారు ఏసీబీ అధికారులు

 

 

Tags:    

Similar News