ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఈరోజు ఒక్క కేసు కూడా?

ఏపీలో కరోనా వ్యాధి ప్రబలుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. కరోనాను మరింత కట్టడి చేసేందుకు [more]

Update: 2020-04-09 05:17 GMT

ఏపీలో కరోనా వ్యాధి ప్రబలుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. కరోనాను మరింత కట్టడి చేసేందుకు ఆరోగ్య శాఖలో పది మంది అధికారులను నియమించారు. పది మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూమ్ లో నియమించారు. ఇవి తాత్కాలిక బదిలీలేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 9గంటల వరకూ 217 నమూనాలను పరీక్షించగా అన్ని కేసులు నెగిటివ్ గా తేలాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348గానే ఉంది.

Tags:    

Similar News