ఏపీపై కేంద్రం మూకదాడులు

Update: 2018-07-24 09:03 GMT

రాజ్యసభలో ఇచ్చిన హామీలను, విభజనచట్టంలో పేర్కొన్న అంశాలను ఎందుకు అమలు చేయడంలేదని తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రశ్నించారు. కొద్దిసేపటిక్రితం రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందన్నారు. ఈకారణంగా ఏపీ భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. ఏపీ కేంద్ర ప్రభుత్వం మూక దాడుల తరహా దాడులకు దిగుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మూడుసార్లు ఏపీలో మాట ఇచ్చారన్నారు. సహకార స్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. తాము నాలుగేళ్లు కేంద్రం సహకరిస్తుందని ఓపికతో ఎదురుచూశామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను అమలుపర్చాలని ఆయన కోరారు.

Similar News