ఏపీ కొత్త బాస్ ఠాకూర్

Update: 2018-06-30 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా R.P. ఠాకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీ ఠాకూర్ ఇప్పుడు ఏపీ కొత్త బాస్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఠాకూర్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్ కు చెందిన IPS అధికారి. ఆర్పీ ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జులై 1న ఆర్పీ ఠాకూర్ జన్మించారు. ఆయన కాన్పూర్ లోని ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఠాకూర్ పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. 1986 డిసెంబర్ 15 న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమిలో అదనపు ఎస్పీగా తొలి సారి నియమించారు. గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ASP గా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో......

జోనల్ హైదరాబాద్ డీసీపీ గా , అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పాట్నా లోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్ (CISF) డీఐజీ గా బాధ్యతలు నిర్వహించారు. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీ గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తున్నారు. 2003 లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఎఎస్ఎస్పీ మెడల్ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011 లో భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందారు. డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News