ఆ వీర శునకానికి.. రెడ్‌ సెల్యూట్‌!

జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడి ప్రాణాలకు ఓ ఆర్మీ శునకం తన ప్రాణాలను అడ్డం వేసింది. ఆర్మీలో విశ్వసనీయత, విద్యుక్త ధర్మం ముందు మరణం కూడా తృణప్రాయమే అని ఆ మూగజీవి కూడా రుజువు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్ట్‌ మరణించాడు.

Update: 2023-09-13 06:06 GMT

సైనికుడి కోసం ప్రాణం ఎదురొడ్డిన ఆర్మీ డాగ్‌

జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడి ప్రాణాలకు ఓ ఆర్మీ శునకం తన ప్రాణాలను అడ్డం వేసింది. ఆర్మీలో విశ్వసనీయత, విద్యుక్త ధర్మం ముందు మరణం కూడా తృణప్రాయమే అని ఆ మూగజీవి కూడా రుజువు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్ట్‌ మరణించాడు. ఈ సంఘటనలో ఓ సైనికుడు కూడా ప్రాణాలర్పించాడు. మరో ముగ్గురు సైనికులకు గాయాలు అయ్యాయి.  సైనికుడు ప్రాణాన్ని ఆర్మీ శునకం ‘కెంట్‌’ కాపాడింది. తనని తీసుకు వెళ్తున్న సైనికుడిని రక్షిస్తూ ముష్కరులకు తాను ఎదురు వెళ్లింది, ఈ క్రమంలో బుల్లెట్‌ గాయాలపాలై కన్ను మూసింది.

‘రాజౌరి వద్ద నార్లా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 21 ఆర్మీ శునక దళానికి చెందిన లేబరడార్‌ జాతి ఆడ శునకం(ఆరేళ్లు) కెంట్‌ ఓ సైనికుల టీమ్‌ను లీడ్‌ చేస్తోంది. ఈ క్రమంలో సైనికులపై అనూహ్యంగా టెర్రరిస్టులు దాడి చేశారు. సైనికుల ముందున్న కెంట్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ముందుకు దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో బుల్లెట్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఆ శునకాన్ని తీసుకువెళ్తున్న సైనికుడు ప్రాణాల్తో బయటపడ్డాడు’ అని జమ్ము డివిజన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ముకేష్‌ సింగ్‌ మీడియాకు వెల్లడిరచారు. ‘ఆర్మీకి చెందిన అత్యున్నత సంప్రదాయాలను పాటిస్తూ కెంట్‌ తన ప్రాణాలను విడిచింది’ అని ఆ మూగజీవికి నివాళులర్పిస్తూ ఆయన చెప్పారు.

Tags:    

Similar News