ఆళ్లగడ్డ వివాదానికి తెరపడింది. చంద్రబాబుతో సమావేశమైన మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు రాజీ పడ్డారు. చంద్రబాబు తో జరిగిన సమావేశంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నా, ఆయన మందలించడంతో దారికొచ్చారు. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. చంద్రబాబుతో సమావేశమయిన తర్వాత అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తాము కలసి పనిచేస్తామని చెప్పారు. అఖిలప్రియ కూడా ఇది తమ కుటుంబ వివాదమని, పెద్దది చేయవద్దని కోరారు. తాను ఏవీ సుబ్బారెడ్డితో కలసి పనిచేస్తానని, సలహాలు తీసుకుంటానని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డి సయితం అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. తన తండ్రి, తల్లిలాగే తాను కూడా రాజకీయాలు చేస్తానని అఖిలప్రియ చెప్పారు.