రాంకీలో 1200 కోట్ల మేర అక్రమాలు.. ఐటీ శాఖ కీలక ప్రకటన
రాంకీ లో జరిగిన ఐటీ సోదాల పై కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయంటూ ఐటీ శాఖ ప్రకటన చేసింది. 1200 కోట్ల [more]
రాంకీ లో జరిగిన ఐటీ సోదాల పై కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయంటూ ఐటీ శాఖ ప్రకటన చేసింది. 1200 కోట్ల [more]
రాంకీ లో జరిగిన ఐటీ సోదాల పై కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయంటూ ఐటీ శాఖ ప్రకటన చేసింది. 1200 కోట్ల రూపాయలు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ఐటి శాఖ ప్రకటించింది . దీంతో పాటుగా మూడు వందల కోట్ల రూపాయల నష్టాన్ని కూడా రాంకీ సంస్థ చూపెట్టిందని పేర్కొంది. మరోవైపు మూడు వేల కోట్ల రూపాయలు సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది . దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో టాక్స్ రాంకీ ఎగ కొట్టాలని ప్రయత్నం చేసిందని వెల్లడించింది. అంతేకాకుండా సింగపూర్ చెందిన కంపెనీకి మేజర్ వాటా ను అమ్మి వేసి నష్టాన్ని రాబట్టే ప్రయత్నం చేసిందని ఐటి శాఖ పేర్కొంది. రెండు రోజుల పాటు జరిగిన సోదాలు పైన ఐటి శాఖ కీలక ప్రకటన చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అయోధ్యరామిరెడ్డి సంబంధించిన సంస్థలు రెండు రోజులపాటు ఐటీ శాఖ సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలకమైన అంశాలను వెలుగులోకి వచ్చాయి. నష్టాన్ని చూపెట్టి రాంకీ కి లాభాలు పొందేందుకు ప్రయత్నం చేసిందని, జరిగిన అక్రమ లావాదేవీలు వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఐటి శాఖ వెల్లడించింది.