ఔటర్ రింగ్ రోడ్డు సామూహిక ఆత్మహత్యలపైన కొత్త కొత్త విషయాలు వెలుగు వస్తున్నాయి. అప్పుల బాధను తట్టుకోలేకనే రవీందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణ లో వెలుగు చూసింది.దీంతో పాటుగా కుటుంబ సభ్యులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు.. నలుగురి కుటుంబ సభ్యులకు తెలియకుండా విషం ఇచ్చి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మొత్తం గా చూసినట్లయితే అసలు అప్పుల బాధతో రవీందర్ రెడ్డి తన కుటుంబంతో పాటుగా పిన్ని కుటుంబాన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ఒక ప్రాధమిక ఆంచనాకు వచ్చారు.. 30 నుంచి 50 కోట్ల వరకు అప్పులు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.. ప్రధానంగా తన పిన్ని వద్దనే పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు,. షేర్ మార్కెట్లో నష్టం వచ్చిన తరువాత అప్పులు చేసి వుంటారని పోలీసులు చెబుతున్నారు.
షేర్ మార్కెట్లో పెట్టి.....
రవీందర్ రెడ్డి ఇండియా ఇన్నొ లైన్ ద్వారా షేర్ మార్కెట్ల్ లో పెట్టుబడులు పెట్టాడు. రవీందర్ రెడ్డితో పాటుగా ప్రభాకర్ రెడ్డి, అతని భార్య లక్ష్మిలకు సంబంధించిన షేర్ బిజినెస్ లన్నింటిని కూడా రవీందర్ రెడ్డి నిర్వహించే వాడు. అంతేగాకుండా.. పిన్ని దగ్గర కూడా రుణం తీసుకున్నాడు. బాబాయి అయిన ప్రభాకర్ రెడ్డి కి తెలియకుండానే పిన్ని లక్ష్మి దగ్గర దాదాపుగా ఐదు కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడు. దీంతో పాటుగా ఇతరుల దగ్గర కూడా 30 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడు.ఈ అప్పుల విషయం భార్యకు తెలియదు. ఇదిలా వుంటే తనకు వచ్చిన నష్టల గురించి ఎప్పడూ ఎవరితోనే రవీందర్ రెడ్డి చర్చించలేదు. ఇదిలా వుంటే చనిపొయే రోజున పిన్ని లక్ష్మి కి కాల్ చేసి దిండి ప్రాజెక్టులో వాటర్ బాగా వచ్చింది చూడడానికి పోదామని చెప్పాడు. అందరూ కలిసి మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరారు. అయితే సాయంత్రం ఆరుగంటలకు తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. రాత్రితొమ్మిది అయినా కూడా రాక పొయే సరికి లక్ష్మి భర్త ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మర్నాడు ఊదయం అందరు కలిసి చనిపోయినట్లుగా తేలింది.
పక్కా ప్లాన్ ప్రకారం.....
ఇకపోతే చనిపొయే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వీరంతా కూడా పటాన్ చెర్వు ప్రాంతంలోనే వున్నారు.అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ముత్తంగి నుంచి లొపలికి ఎంట్రీ అయ్యారు. రాత్రి తొమ్మిది గంటలకు అందరు కలిసి ఔటర్ కు మీదకు వచ్చారు. అప్పటి నుంచి కూడా వీరి అందరి సెల్ ఫొన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. తరువాత కొల్లురు వద్దకు వచ్చారు.అప్పటికే కూల్ డ్రింక్ తో పాటుగా మంచి నీళ్లలో విషం కలిపాడు రవీందర్ రెడ్డి. లక్ష్మితో పాటుగా భార్యకు తెలియకుండానే వారికి విషంతో కూడిన కూల్ డ్రింక్స్. మంచినీళ్లునుతాగించాడు. వీరు చనిపోయిన తరువాత వారి డెడ్ బాడీలను కొల్లూరు గ్రామ సమీపంలో పడేశాడు.తరువాత తన కూమారుడిని తీసుకుని ఔటర్ రింగ రోడ్డు బైసాస్ కిందకు వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఇదిలా వుంటే దాదాపుగా 30 కోట్ల వరకు అప్పులు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది.మొత్తం పన్నెండు బ్యాంకుల్లో అకౌంట్స్ వివరాలను పోలీసులు తెప్పించారు. ఏ ఒక్క అకౌంట్ లో కూడా ఐదు వందల రూపాయలకు మించి కూడా బ్యాలెన్స్ కూడా లేదని పోలీసుల విచారణలో బయట పడింది.