రేపు వైఎస్సార్సీపీ ఐటీ సదస్సు
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరగబోయే ఈ సదస్సుకు హైదరాబాద్ తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు..
ysrcp it wing conference
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీన హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ తో భారీ సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగ అధ్యక్షులు సునీల్‌కుమార్ రెడ్డి పోసింరెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు.
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరగబోయే ఈ సదస్సుకు హైదరాబాద్ తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. ఈ సదస్సులో వైఎస్సార్సీ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సదస్సుకు వైఎస్సార్సీపీని అభిమానించి ఐటీ ఉద్యోగులంతా హాజరై విజయంవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. సదస్సుకు హాజరు కావాలనుకున్నవారు ముందుగా తమపేర్లను నమోదుచేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7829922666, 7032597980 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.