ఇల్లెందులో పూజారి ఇంట ఇఫ్తార్ విందు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పూజారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. లింగాలఘణపురంలో కులాంతర వివాహం వివాదానికి దారితీసింది.

Update: 2025-03-15 07:00 GMT

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని స్టేషన్ బస్తీలో గణేశ్ ఆలయ పూజారి హరగోపాల్ శర్మ గురువారం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, రోజా పాటించే ముస్లిం సోదరులను సాయంత్రం తన ఇంటికి ఆహ్వానించి, వారి కోసం ప్రత్యేకంగా వడ్డించిన వివిధ రకాల వంటకాలను అందించారు. ఈ సందర్భంగా ముస్లిం సముదాయ సభ్యులు హరగోపాల్ శర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కులాంతర వివాహం చేసుకున్న కొడుకు... తండ్రి అంత్యక్రియలకు కులస్తుల దూరం

జనగామ జిల్లా, లింగాలఘణపురంలో గురువారం ఓ వ్యక్తి అంత్యక్రియలకు కులస్థులు దూరంగా ఉండిన ఘటన చోటు చేసుకుంది. కారణం, అతని కొడుకు కులాంతర వివాహం చేసుకోవడమే.

60 ఏళ్ల దయ్యాల భిక్షపతి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, అతని కొడుకు అనిల్‌ ఆరు నెలల క్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగా, కొంతమంది కుల పెద్దలు అనిల్ తలకొరివి పెట్టరాదని, మృతుడి భార్యే అంత్యక్రియలు నిర్వహిస్తే హాజరవుతామని షరతు పెట్టారు.

దీంతో, భిక్షపతి భార్య ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కుల పెద్దలకు కౌన్సెలింగ్ ఇవ్వగా, కొంతమంది చివరకు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News