మీరు కదా కలెక్టర్ అంటే... ఇలా అందరూ చేస్తే?

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Update: 2025-02-06 04:47 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కలెక్టర్ గా ఆయన తన బాధ్యతలను నిర్వహిస్తూనే విద్యార్థుల బాగోగులను పట్టించుకోవడం పై ప్రశంసల జల్లు కురుస్తుంది. భరత్ అనే పదో తరగతి విద్యార్థి ఇంటికి ఈరోజు తెల్లవారుజామున వెళ్లిన జిల్లా కలెక్టర్ చదువుపై ఆరా తీశారు.

పదో తరగతి విద్యార్థి భరత్ ఇంటికి వెళ్లి...
పదో తరగతి విద్యార్థికి ముఖ్యమైన దశ అని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని, తెల్లవారు జామున లేచి చదువు కుంటే బాగా మైండ్ లోకి ఎక్కుతుందని కలెక్టర్ భరత్ కు చెప్పారు. భరత్ తండ్రి మరణించారు. తల్లి భరత్ ను చేరదీసి చదవివస్తుంది. దీంతో భరత్ వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఐదు వేల రూపాయలు నెలకు ఆర్థిక సాయాన్ని పరీక్షల వరకూ ఇస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి నెల సాయాన్ని కలెక్టర్ అందచేశారు. బాగా చదువుకుని తల్లికి గిఫ్ట్ ఇవ్వాలని కలెక్టర్ భరత్ ను కోరారు. ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా కలెక్టర్ చేసిన పనిని అభినందిస్తున్నారు.


Tags:    

Similar News