Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత టార్గెట్ ఈసారి వాళ్లేనా?

కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఈరోజు ఎవరిని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారన్నది చర్చనీయాంశమైంది.

Update: 2025-09-03 06:04 GMT

కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఈరోజు ఎవరిని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించారన్నది చర్చనీయాంశమైంది. కాసేపట్లో కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు రానుండడంతో ఏ ప్రకటన చేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయనున్నారు.

రాజీనామా లేఖలను...
రాజీనామా లేఖలను తన అనుచరుల ద్వారా తెలంగాణ భవన్, శాసనమండలి ఛైర్మన్ కు పంపనున్నట్లు తెలియనుంది. దీంతో పాటు మరో సారి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయనున్నారని, ఆ లేఖను మీడియా సమావేశంలో బహిర్గత పర్చనున్నారు. అయితే నిన్న కవిత సస్పెన్షన్ చేసిన తర్వాత కొందరు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా కవిత కౌంటర్ ఇవ్వనున్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలపై ఇంకేం విమర్శలు చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.


Tags:    

Similar News