Kalvakuntla Kavitha : నాన్న.. అన్న.. మంచోళ్లు.. చేసేదేదంతా వాళ్లే

కల్వకుంట్ల కవిత మీడియా సమావేశాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనకు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై ఎటువంటి వ్యతిరేకం లేదని చెప్పకనే చెప్పారు

Update: 2025-09-03 08:00 GMT

కల్వకుంట్ల కవిత మీడియా సమావేశాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనకు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై ఎటువంటి వ్యతిరేకం లేదని చెప్పకనే చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లు మంచోళ్లేనని, కానీ ఆయన పక్కన ఉండి చెడగొడుతుంది హరీశ్ రావు, సంతోష్ రావులు మాత్రమేనని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీశ్ రావు అరవై లక్ష రూపాయలు సిరిసిల్ల నియోజకవర్గానికి పంపారని తెలిపారు. అలాగే కేసీఆర్ ను ఓడించడానికి కూడా హరీశ్ రావు ప్రయత్నించారని తెలిపారు. అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి కూడా హరీశ్ రావు కారణమని ఆమె చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి కూడా హరీశ్ రావు కారణమని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్ని జన్మల పుణ్మముంటే తనకు కేసీఆర్ లాంటి తండ్రి ఉంటారని కూడా సెంటిమెట్ తో కొట్టారు.

కొన్నేళ్ల నుంచి కుట్రలు...
హరీశ్ రావు, సంతోష్ రావులు గత కొన్నేళ్ల నుంచి తనపై కుట్రలు చేస్తూ వస్తున్నారని, వాళ్లిద్దరూ రేవంత్ రెడ్డి తో ఏకమై తనను బయటకు పంపేందుకు కూడా కుట్రలు పన్నింది వాళ్లేనని స్పష్టంగా చెప్పారు. వ్యక్తిగత లబ్ది పొందేవాళ్లు తాము ముగ్గురం కలసి ఉండొద్దని భావించి మొదటి అడుగులో తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. తనకు తొలిసారిగా ఆరడుగుల బుల్లెట్ తాకిందని, తర్వాత రామన్నను, తర్వాత కేసీఆర్ ను కూడా తాకే అవకాశం లేకపోలేదని కవిత తెలిపారు. తాను, కేటీఆర్ లు తెలంగాణ ఉద్యమం సమయంలో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఆయన వెంట నడిచామన్నారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతే వారు బాగుపడతారని భావించి ఉండవచ్చు అని అన్నారు.
కుటుంబాన్ని విడదీసి...
కేసీఆర్ కు కూడా కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలో భాగంగానే తనపై ఈ నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ పై వత్తిడి తెచ్చారన్నారు. కవిత మీడియా సమావేశం చూసిన వారికి ఎవరికైనా.. తండ్రి కేసీఆర్ ను దూరం చేయాలని భావించడం లేదు. అలాగే సోదరుడు కేటీఆర్ కు, తనకు ఏ మాత్రం విభేదాలు లేవని కూడా ఆమె నేరుగానే చెప్పారు. తన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నానని చెబుతూ పార్టీలో అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్ లను ఆకట్టుకునే ప్రయత్నం కవిత మీడియా సమావేశంలో కనపడిందని చెప్పాలి. హరీశ్ రావు, సంతోష్ రావు లను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.


Tags:    

Similar News