మద్యం లారీ బోల్తా... మందుబాటిల్స్ కోసం ఎగబడిన జనం

మద్యం సరుకుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు

Update: 2024-05-23 06:54 GMT

మద్యం సరుకుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. సికింద్రాబాద్‎లోని బోయిన్ పల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేస్‎ల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇక జనం అవి తీసుకొని పరుగుతీశారు.లారీ టైర్ పంక్చర్ కావడం వల్ల డివైడర్‎ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.

మూదు లక్షల విలువైన...
దీని వల్ల దాదాపు రూ. 3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయని సమాచారం. రోడ్డుపై జనం ఎగబడడంతో అక్కడ ట్రాఫిక్‎కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన మిగతావారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు శ్రమించారు.


Tags:    

Similar News