రైతు ఉత్సవాలకు రేవంత్ కు ఆహ్వానం
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు ఆహ్వానాన్ని అందించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా...
ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యాచరణలో భాగంగా ఈ నాలుగు రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 22న సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలో రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.