Telangana : నేడు తెలంగాణకు భారత ఉప రాష్ట్రపతి
నేడు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ తెలంగాణ లో పర్యటించనున్నారు. సంగారెడ్డి లో ఆయన పర్యటన కొనసాగుతుంది
నేడు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ తెలంగాణ లో పర్యటించనున్నారు. సంగారెడ్డి లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ను జగదీప్ థన్ కడ్ సందర్శించనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత ఉప రాష్ట్రపతి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో...
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ సంగారెడ్డి నుంచినేరుగా హైదరాబాద్ చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు తెలంగాణ గవర్నర్ కూడా పాల్గొననున్నారు. సంగారెడ్డి కి వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.