గ్రీన్ ట్యాక్స్ ను పెంచేసిన తెలంగాణ ప్రభుత్వం

. రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచుతూ.. శ్లాబులవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం.

Update: 2022-05-12 05:46 GMT

హైదరాబాద్ : పెరుగుతున్న ఇంధన ధరలను చూసి వాహనాల యజమానులు ఇప్పటికే గగ్గోలు పెడుతూ ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 'గ్రీన్ ట్యాక్స్' ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆయా కేటగిరీలకు చెందిన వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహనాలకు నామమాత్రంగా గ్రీన్‌ట్యాక్స్‌ ఉండేది. ఇప్పుడు దాన్ని శ్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్లు, 10 నుంచి 12 ఏళ్లు, 12 ఏళ్లు దాటినవి.. ఇలా 3 శ్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తోంది. రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచుతూ.. శ్లాబులవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం. గ్రీన్ ట్యాక్స్, క్వాట‌ర్లీ ట్యాక్స్ పెంచింది ర‌వాణా శాఖ‌.

అధికారికంగా జీవో ఇంకా విడుద‌ల చేయ‌క‌పోయినా ర‌వాణా శాఖ స్లాట్ బుకింగ్‌లో మాత్రం ఇప్ప‌టికే అప్‌లోడ్ చేసింది. 15 ఏళ్లు దాటిన క‌మ‌ర్షియ‌ల్ బండ్ల‌కు కండీష‌న్, పిట్‌నెస్ మ‌రో ఐదు సంవత్సరాలు పొడిగిస్తూ రిజిస్ట్రేష‌న్ చేయిస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు దాదాపు 30 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నాయి. ఏడేళ్లు దాటిన క‌మ‌ర్షియ‌ల్ వెహికిల్స్‌కు 200 రూపాయలు, 15 ఏళ్లు నిండిన నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌కు ఏటా 200 రూపాయలు, ఇలా వాహ‌నాల‌ను బట్టి గ్రీన్ ట్యాక్స్‌ను రెండు స్లాబుల్లో చెల్లించే వారు. తాజాగా ర‌వాణా శాఖ దీన్ని మూడు స్లాబులుగా చేసింది. ఇక క్వాట‌ర్లీ ట్యాక్స్‌లో 20 శాతం పెంచింది ర‌వాణా శాఖ‌. లారీలు, ట్రావెల్స్‌పై 20 శాతం ట్యాక్స్ పెంచారు. ట్రావెల్ వాహ‌నాల‌కు సీట్ల‌ను బ‌ట్టి ట్యాక్స్‌లు విధిస్తారు.

రిజిస్ట్రేషన్ తేదీ నుండి మోటారుసైకిల్ కొత్తది కొని 15 సంవత్సరాల కంటే ఎక్కువ, 20 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, గ్రీన్ ట్యాక్స్ ఐదేళ్లకు రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాహనం అయితే పన్ను రూ. 5,000 గా నిర్ణయించబడింది. ఇంతకు ముందు 15 ఏళ్లు దాటిన మోటార్‌సైకిళ్లపై 'గ్రీన్ ట్యాక్స్' 250 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఎనిమిది రెట్లు పెరిగింది. మోటార్‌సైకిళ్లు కాకుండా ఇతర వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన, 20 ఏళ్ల లోపు ఉన్న కార్ల వంటి వాటికి, 'గ్రీన్ ట్యాక్స్' ఐదేళ్లకు రూ. 5,000కి పెంచబడింది. గతంలో రూ. 500 ఉండేది. ఇవే వాహనాల వయసు 20 ఏళ్లు దాటితే, అప్పుడు ఐదు సంవత్సరాలకు పన్ను రూ. 10,000 గా పెంచేశారు.
క్యారేజీలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలు, విద్యాసంస్థల బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఏడేళ్లలోపు- పదేళ్ల లోపు ఉన్న రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ ఏడాదికి రూ.4,000గా నిర్ణయించి, దాని వయసు 10 ఏళ్లు దాటితే యజమాని సంవత్సరానికి రూ. 5,000 చెల్లించాలి. గతంలో ఏడేళ్లకు పైగా పాత రవాణా వాహనాలకు ఏడాదికి రూ.200 పన్ను ఉండేది. కొత్త G.O. ప్రత్యేకంగా LPG, CNG, బ్యాటరీ, సోలార్ పవర్‌తో నడిచే వాహనంపై ఎలాంటి 'గ్రీన్ ట్యాక్స్' విధించలేదు. మూడు చక్రాల కాంట్రాక్ట్ క్యారేజీలకు (ప్యాసింజర్ ఆటో రిక్షాలు) సంబంధించి 'గ్రీన్ ట్యాక్స్' కూడా ఉండదు.


Tags:    

Similar News