Telangana : నేటి నుంచి తెలంగాణలో వనమహోత్సవం

తెలంగాణలో నేటి నుంచి వనమహోత్సవం ప్రారంభమవుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

Update: 2025-07-07 02:09 GMT

తెలంగాణలో నేటి నుంచి వనమహోత్సవం ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాన్ని నేడు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారుల అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలు పడుతుండటంతో ఈ సమయంలో మొక్కులు నాటి పచ్చదనం పెంచేందుకు దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మొక్కలను సిద్ధం చేశారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో...
వనమహోత్సవం కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. వనమహోత్సవం కార్యక్రమంలో అందరూ పాల్గొని పండగలా జరపాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది.


Tags:    

Similar News