ఎవరు ఫాసిస్ట్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2022-09-13 07:36 GMT

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ మొహం చూసేందుకు ఇష్పపడని కేసీఆర్ సస్పెండ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఎవరు ఫాసిస్ట్ అనేది అందరికీ అర్ధమవుతుందన్నారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన వ్యాపారాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఫాసిస్ట్ అని ఆయన ప్రశ్నించారు.

ఎవరు మాట్లాడుతున్నారు...?
ఎన్ని కుట్రలు చేసిన హుజారాబాద్ నియోజకవర్గ ఆశీస్సులతో ఈటల రాజేందర్ ఎన్నికయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆయనను మాట్లాడనివ్వకుండా నిజాంలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ప్రజల తీర్పును కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. శాసన సభ నియమాలకు విరుద్ధంగా మాట్లాడింది కేసీఆర్ అని, ఆయనను స్పీకర్ శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడుతున్న భాష ను అందరూ వింటున్నారన్నారు. ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు. గవర్నర్ ను కూడా అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ లో అభద్రత పెరిగిందన్నారు. అందుకే అందరినీ గోకుతున్నారన్నారు.


Tags:    

Similar News