Kishan Reddy : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను రేవంత్ రెడ్డి కోసమో? లేక కాంగ్రెస్ పార్టీ కోసమో పనిచేయడం లేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడటం ఫ్యాషన్ గా మారిపోయిందన్న కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది మూడు రోజుల క్రితమేనని అన్నారు.
మూడు రోజుల క్రితమే...
మూడు రోజుల క్రితం మెట్రో రైలు విస్తరణ పనులకు డీపీఆర్ ఇస్తే కేంద్ర కేబినెట్ కు ఎలా వస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పనికి మాలిన మాటలను మాట్లాడకుండా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సూచించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని, ప్రాధాన్యత క్రమంలో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.