హైదరాబాద్ లో కరోనా పంజా .. 20 మంది పోలీసులకు
నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇరవై మంది పోలీసులకు కరోనా సోకింది.
థర్డ్ వేవ్ లో పోలీసులు ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వెంటాడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇరవై మంది పోలీసులకు కరోనా సోకింది.
హోంఐసొలేషన్ లో.....
ఇరవై మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వీరందరూ హోంఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. పోలీస్ స్టేషన్ లోకి ఎవరిని అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ బయట ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేస్తున్నారు.