రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. సికింద్రాబాద్‌లో గులాబీ నేతలు ధర్నా చేపట్టారు. చీఫ్‌ రేషన్‌ ఆఫీసర్

Update: 2022-03-24 08:06 GMT

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని అందరూ ఊహించారు. ఊహించిందే జరిగింది. వరుసగా రెండ్రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్రం. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు రేట్లను పెంచుతోందంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలకు నిర‌స‌నగా కూడా ఆందోళ‌న కార్య‌క్రామ‌లు చేయాల‌ని పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపుతో.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. సికింద్రాబాద్‌లో గులాబీ నేతలు ధర్నా చేపట్టారు. చీఫ్‌ రేషన్‌ ఆఫీసర్ కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపై సైకిల్ తొక్కుతూ ఎమ్మెల్యే తన నిరసన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News