సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు మృతి చెందారు.

Update: 2022-01-30 06:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు మృతి చెందారు. కమలాకర్ రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. కామారెడ్డి పట్టణంలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన తన స్వగృహంలోనే కన్నుమూశారు. కమలాకర్ రావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కామారెడ్డిలో ...

మేనమామ కమలాకర్ రావు మృతి పట్ల కేసీఆర్ విచారాన్ని వ్యక్తం చేశారు. తన బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. చిన్నప్పుడు మేనమామ ఇంటికి వచ్చి సెలవులు గడిపే వాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కమలాకర్ రావు సుదీర్ఘకాలంగా కామారెడ్డిలోనే స్థిరపడి ఉన్నారు. ఆయన కుమార్తెలు, కుమారుడు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.


Tags:    

Similar News