నేడు నల్లగొండలో బండి సంజయ్ పర్యటన

నేడు నల్లగొండ జిల్లాలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటిస్తున్నారు

Update: 2024-05-25 05:33 GMT

నేడు నల్లగొండ జిల్లాలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటిస్తున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం బండి సంజయ్ నేడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

అభ్యర్థికి మద్దతుగా...
ఈరోజు బండి సంజయ్ నల్లగొండ పట్టణంలోని బండారు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కోరుతూ ఆయన యువతతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఈరోజు నల్లగొండలో ఆయన పర్యటిస్తున్నారు.



Tags:    

Similar News