Breaking: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదానేనా?
తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది
postponement of group two exam in telangana
తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు చేయకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పరీక్షకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకూ దాని గురించి టీఎస్ఎఎస్సీ నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏర్పాట్లు చేయకపోవడంతో...
తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఛైర్మన్ నుంచి అందరు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష ఈసారైనా జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు. మొత్తం 783 పోస్టులకు ఐదు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీ దగ్గరపడుతుండటంతో అసలు పరీక్ష జరుగుతుందా? మరో సారి వాయిదా పడుతుందా? అన్న టెన్షన్ లో అభ్యర్థులున్నారు.