నేడు తెలుగు సినీ నిర్మాతల సమావేశం

నేడు మరోసారి తెలుగు సినీ నిర్మాతల సమావేశం జరగనుంది

Update: 2025-05-22 03:42 GMT

నేడు మరోసారి తెలుగు సినీ నిర్మాతల సమావేశం జరగనుంది. ఫిలిం ఛాంబర్ లో జరగనున్న ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఇప్పటికే కోరిన నిర్మాతలు సమస్యలను వేరే మార్గంలో పరిష్కరించుకుందామని చెప్పనున్నారు.

థియేటర్ల బంద్ పై...
జూన్ 1న థియేటర్ల బంద్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది. నేటి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. థియేటర్ల యజమానాలు అద్దె ప్రాతిపదికన కాకుండా తమకు కమీషన్ల రూపంలో ఇవ్వాలంటూ థియేటర్ల సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశం కీలకంగా మారనుంది. నేడు థియేటర్ల బంద్ పై నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News