ఔను.. వాళ్లిద్దరూ కలిశారు.. బద్ద శత్రువులు ఒక్కటయ్యారు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత పార్టీలో కొంత మందితో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి

Update: 2023-08-29 05:50 GMT

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత పార్టీలో కొంత మందితో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. టికెట్‌ దక్కని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వారికి కాకుండా ఇతరులకు టికెట్‌ లభించడంతో ఎడముఖం పెడముఖంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగిస్తూ పార్టీలో మున్ముందు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, ఎలాంటి అసంతృప్తికి గురికావద్దంటూ సముదాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాలిద్దరు కలిసిపోయారు. బద్ద శత్రువులుగా ఉండే వీరు క్యాంపు కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యి.. చేతులు కలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మూడు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు టికెట్స్ కోసం పోటీ పడ్డారు. చివరి వరకు గట్టి ప్రయత్నం చేసినా ఫలించలేదు. వైరా నుంచి 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి మదన్ లాల్, ఇండిపెండెంట్‌గా రాములు నాయక్ పోటీ చేశారు.

రాములు నాయక్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత రాములు నాయక్ బీఆర్‌ఎస్‌ పార్టీలోలో చేరారు. అప్పటి నుంచి..రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వర్గాలుగా విడిపోయారు. ఒకే వేదికపై వీరు ఎప్పుడు కూడా కలిసింది లేదు. దూంగానే ఉంటూ ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వీరిని దగ్గర చేసేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటి మనసులో మార్పు రాలేదు.

అయితే వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్‌ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. కానీ చివరి నిమిషంలో జాతకం తారుమారైపోయింది. చివరి నిమిషం వరకు ముగ్గురు కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరంగానే చేశారు. కానీ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు షాకిచ్చింది. జిల్లాలో సిట్టింగ్‌లు అందరికీ టికెట్స్ ఇచ్చినా.. రాములు నాయక్ కి మాత్రం ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కి ఇవ్వడంతో.. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. టికెట్ దక్కక పోవడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తారని భావించినా..ఆయన అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఇటీవల మదన్ లాల్ నిర్వహించిన ర్యాలీలోనూ రాములు నాయక్ అనుచరులు, ఆయన వర్గీయులు అందరూ పాల్గొన్నారు

తాజాగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు వెళ్ళారు. దీంతో వారు ఇద్దరు కలిశారు. సమావేశమై చేతులు పలిపారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయన నిర్ణయం, ఆదేశాల మేరకు పని చేస్తానని రాములు నాయక్ ప్రకటించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించడమే తమ లక్ష్యమంటూ చెప్పుకొన్నారు. త్వరలోనే ఇద్దరం కలిసి నియోజక వర్గంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు. వాలిద్దరు కలిసిపోవడంతో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News