Telangana : నేటి నుంచి ఎన్నికల కోడ్.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటించారు. నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించి 12,733 గ్రామ పంచాయతీలకు, 1,12,288 వార్డులకు సంబంధించి ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ...
తొలి దశ ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో 1.66 కోట్ల మంది ఓటర్లు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాణికుమిదిని తెలిపారు. ఏదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారని రాణికుముదిని పేర్కొన్నారు. అదే రోజు పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి.