శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనున్నట్లు అధికారులు తెలిపారు

Update: 2023-02-07 02:08 GMT

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. శివరాత్రికి శైవ క్షేత్రాలను భక్తులు దర్శించుకుంటారు. అందుకోసం శైవ క్షేత్రాల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకూ మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్‌సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

ఛార్జీలు....
సూపర్ లగ్జరీలో ఒక్కొక్కరికీ రూ.600లు, డీలక్స్ లో రూ.540లు, ఎక్స్‌ప్రెస్ లో రూ.460 ల లెక్కన ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. రిజర్వేషన్ల సదుపాయం కూడా ఇప్పటి నుంచే కల్పించామని, భక్తులు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. భక్తులను సురక్షితంగా శ్రీశైలం తీసుకెళ్లి తిరిగి దైవ దర్శనం తర్వాత గమ్యస్థానాలను చేర్చే బాధ్యత ఆర్టీసీదేనని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News