ఉత్తమ్ కు ఢిల్లీ నుంచి పిలుపు.. హుటాహుటిన బయలుదేరిన మంత్రి

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు

Update: 2025-06-10 11:58 GMT

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధినాయకత్వం పిలుపు మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అధినాయకత్వంతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో లభించిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు జరిపారు. నిన్నటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి అధినాయకత్వం పిలవడంతో ఢిల్లీలో ఏం జరుగుతుందన్న దానిపై చర్చ జరుగుతుంది.

మంత్రివర్గం కూర్పుపై...
మంత్రివర్గం కూర్పుపై చర్చించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధినాయకత్వం పిలిచిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ కు సంబంధించి మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్నాయా? అన్న దానిపై చర్చించేందుకు ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వేరే ఏదైనా విషయాలను చర్చించేందుకు ఢిల్లీకి పిలిచారా? లేక ఇంకేదైనా పదవులను భర్తీ విషయంలో మాట్లాడేందుకు పిలిచారా? అన్నది తేలాల్సి ఉంది.


Tags:    

Similar News