బీజేపీపై హరీష్ రావు జోస్యం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతోందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు.

Update: 2023-05-29 02:57 GMT

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. బీజేపీ దుకాణం తెలంగాణలో బంద్ అయినట్టే కనిపిస్తోందని అన్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తుంటే, మరికొందరు కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని బాంబు పేల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కేంద్రంలోనూ ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలే దీనికి నిదర్శనమని అన్నారు.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా ప్రజలకు ఏ మాత్రం మంచి జరగడం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రైతులకు ఉచిత కరెంట్, సాగునీరు అందడం లేదని అన్నారు. అక్కడి రైతులు సాగునీటి కోసం ఇప్పటికీ ఆయిల్ ఇంజన్లను వాడుతున్నారని.. తెలంగాణలో టార్చిలైట్ పెట్టి వెతికినా పొలాల వద్ద ఆయిల్ ఇంజన్లు కనబడవని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతోందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. కాంగ్రెస్ అబద్దాలను తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయక త్వంలో బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టి, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 144 నుంచి 50 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దిక్కు లేరని, అలాంటి పార్టీ ఎలా అధికారం లోకి వస్తుందని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడి పేరు పార్లమెంటుకు ఎందుకు పెట్టరని ప్రధాని మోదీని ప్రశ్నించారు.


Tags:    

Similar News