Telangana : తెలంగాణలో నకిలీ మద్యం తయారీ కలకలం

తెలంగాణ లిక్కర్ లవర్స్ తాగుతున్నది ఇన్నాళ్లు నకిలీ మద్యమే

Update: 2025-07-22 04:51 GMT

తెలంగాణ లిక్కర్ లవర్స్ తాగుతున్నది ఇన్నాళ్లు నకిలీ మద్యమే. కేటుగాళ్లు నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 178 బ్రాండ్స్‌ కల్తీ చేసినట్లు గుర్తించారు. సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోదాంపై తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ దాడులు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

178 బ్రాండ్లతో...
ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్‌, కొంత మద్యం కలిపి.. సీల్‌ వేసి కిక్‌కు చెక్‌ పెట్టిన మద్యం మాఫియా ఈ నకిలీ మద్యాన్ని తయరాు చేస్తుంది. పోలీసులు దాడులు చేసి సుమారు 15 లక్షల రూపాయల విలువైన కల్తీ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్న కల్తీ మద్యం మాత్రమేనని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News