Kaleswaram : సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ

తెలంగాణ శాసనసభలో సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ జరగనుంది

Update: 2025-08-31 08:00 GMT

తెలంగాణ శాసనసభలో సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరపాలని నర్ణయించింది. ఈ మేరకు శాసనభలో కాళేశ్వరం కమిషన్ నివేదికను టేబుల్ చేసిన ప్రభుత్వం ఇప్పటికే సభ్యులకు నివేదిక కాపీలు అందజేశామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రతిపక్షానికి...
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరి అభిప్రాయాలతోనే చర్యలు తీసుకుంటామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై కూలంకషంగా చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News