Kalvakuntla Kavitha : నేడు కవిత కీలక నిర్ణయం
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు లండన్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు లండన్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. బతుకమ్మ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళిన కవిత నేడు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత జాగృతి నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జాగృతి నేతలతో కవిత సమావేశం ఉండనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరుపున పోటీ చేయడంపై నేడు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. నేతల అభిప్రాయాలను విన్న తర్వాత స్థానికసంస్థల ఎన్నికలపై పోటీ చేయడంపై ఒక ప్రకటన వెలువరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.