Klavakuntla Kavitha : నేడు కేసీఆర్ సొంత గ్రామానికి కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత నేడు సిద్ధిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు

Update: 2025-09-21 02:48 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత నేడు సిద్ధిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామంలో కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో నేడు పాల్గొంటారు.

బతుకమ్మ వేడుకల్లో...
బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన తర్వాత కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడగ గ్రామస్థులు కవితను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. దీంతో తన సొంత గ్రామమైన చింతమడకకు ఆమె నేడు చేరుకోనుండటంతో గ్రామస్థులు భారీ సంఖ్యలో స్వాగతం పలకనున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకుంటారు.


Tags:    

Similar News