Kalvakuntla Kavitha : 2 గంటల పాటు నిరాహారదీక్ష అందుకే
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ లో కవిత 72 గంటల పాటు నిరాహారదీక్షకు దిగారు. సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగుపడినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాజ్యాధికారంలోనూ బీసీలకు వాటా ఉండాల్సిందేనని అన్నారు.
రిజర్వేషన్లు అమలు చేసేంత వరకూ...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి తీరాల్సిందేనని కవిత అన్నార. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలంటూ తాను 72 గంటల పాటు దీక్షకు దిగితే ప్రభుత్వం అంత సమయం అనుమతి ఇవ్వలేమని అంటుందని, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బడుగులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ధర్నాలకు ఎందుకు అనుమతి ఇవ్వరని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రిజర్వేషన్లు అమలు చేసేంత వరకూ తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.