Telangana: హ్యాకింగ్ కు గురైన తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్ కు గురయింది.

Update: 2025-11-15 06:13 GMT

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్ కు గురయింది. డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గేమింగ్‌ సైట్‌లోకి వెళ్తుందని రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్ కు గురయిందని తెలిసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు.

రీసెట్ చేసిన...
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్ జరిగిన విషయంపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింి. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ ను ఎస్ఐసీ అధికారులు తిరిగి రిస్టోర్‌ చేసినట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్ కు గురైన విషయంలో విదేశీ గేమింగ్‌ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News