Telangana : బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-10-08 01:50 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈవిచారణ చేపట్టనుంది. రిజర్వేషన్ పెంపుపై జీవో నెంబరు 9ను కొట్టివేయాలంటూ పిటీషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఇంకా నిర్ణయం వెలువడలేదని చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడంతో నేటి విచారణ ఆసక్తికరంగా మారింది.

42 శాతం రిజర్వేషన్లపై...
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు నిర్ణయం ఏవిధంగా ఉంటుంది? అన్నదానిపై ఉత్కంఠగా ఉంది. రేపు లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండటం, రేపటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుండటంతో హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ మంత్రులు, నేతలతో సమావేశమై నేడు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించడంపై నిన్ననే సుదీర్ఘంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొందరు రిజర్వేషన్లు సమర్థిస్తూ ఇంప్లీడ్ పిటీషన్ లు వేయడంతో దానిపై కూడా నేడు చర్చ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News